హాయ్ ఫ్రెండ్స్ ..! నేను బాగున్నాను. మీరు బాగున్నారా..!! ఈ రోజు నా గురుంచి కొంత మీతో పంచుకోవాలి అనుకొంటున్నాను. నా గురుంచి చెప్పాలంటే నేను పుట్టింది మేట్టువారి పల్లి అనే ఓ చిన్న గ్రామం లో, కానీ పెరిగింది చదువులు అన్నీ విజయవాడ లోనే.విజయవాడ అంటే ఇండియా లో నే చెప్పుకోదగ్గ పేరు ఉన్న పట్టణం. రవాణాకి, వ్యాపారానికి పెట్టింది పేరు.విజయవాడ కి మరో ప్రత్యేకత ఉంది తెలుసా అది ఏంటంటే ప్రపంచం లోనే రెండవ వాటికాన్ సిటీ గా ప్రసిద్ధి.ఎందుకంటే నగరం లో నుండే ఓ నది ప్రవహిస్తుంది అదే కృష్ణానది.ఎన్నో వేల ఎకరాల పొలాలకి ఎంతో మంది జనానికి నీరు అందిస్తుంది.ఇలా చెపుతూ పోతే చాలా ఉంది మా మహా నగరం గురుంచి......
నేను అక్షరాభ్యాసం చేసింది నాగార్జున చిల్డ్రన్స్ కాన్వెంటు , రాణిగారి తోట లో.మా నాగేంద్రం మాస్టారు చేతుల మీదుగా జరిగింది ఆ కార్యక్రమం.ఒకటో తరగతి చదివింది ఓ క్రిస్టియన్ మెషినరీ స్కూల్ అక్కడే మా ఇంటి దగ్గర.ఆ తరువాత రెండవ తరగతి కమలానికేతన్,అజిత్ సింగ్ నగర్ లో.ఇక మూడు నుండి అయిదు దాకా శారద విద్యాలయం , ప్రకాష్ నగర్ లో చదివాను.ఆరు నుండి పది వరకు వివేకానంద సెంటీనరీ హై స్కూల్, అజిత్ సింగ్ నగర్ లో చదివాను.తరువాత ఇంటర్మీడియట్ లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ తో పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ & సైన్సు జూనియర్ కాలేజీ లో డిష్టిక్షణ్ తో పూర్తి చేశాను.ఇక డిగ్రీ వచ్చేసరికి ఎస్ . ఆర్ . ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో డిష్టిక్షణ్ తో పూర్తి చేశాను.మరి పోస్ట్ గ్రాడ్యు యేషన్ ఏమో కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేశాను అదేనండి, ఈ సంవత్సరమే ఎం.సి.ఎ పూర్తి చేశాను ఎం చేస్తాం ఇది కూడా డిష్టిక్షణ్ తో నే పూర్తి చేశాను.
ఇంక అయితే ప్రస్తుతం నేను ఏమి చేస్తున్నాను అనుకొంటున్నారా సముద్రం లో నీటి చుక్క ఎండా కాలం లో వర్షం కోసం ఎదురు చూస్తుంది అంట కదా అదేదో చిప్ప లో పడి ముత్యం లా మారటానికి ! అలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటే ప్రయత్నిస్తునాను ఉద్యోగం కోసం.అదేదో తెలుగు సినిమా లో "సాపాటు ఎటూ లేదు..! పాట ఆయినా పాడు గురూ.. !! " ఆన్నట్లు," ఉద్యోగం ఎటూ ఇంకా రాలేదు..! కదా నీ జీవిత గాధ అయినా రాసుకో తమ్ముడూ..!! " అని నా మనస్సు ఓ గోల పెడుతుంటే ఇలా రాయడం మొదలు పెట్టాను.ఇదీ సంగతి ఇట్లు
మీ చిన కోటయ్య
అసలు పేరు : చిన కోటయ్య.....
ఇంటి పేరు : అయినకోట.....
ముద్దు పేర్లు : బంధువులు అందరూ చిన్నోడు అంటారు...
క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో కోటి అంటారు...
డిగ్రీ ఫ్రెండ్స్ కార్పొరేటర్ అంటారు...
మరి పీజీ ఫ్రెండ్స్ ఏమో బాబాయ్ అంటారు...
కొందరు ఫ్రెండ్స్ కోటయ్య అంటారు...
మరికొందరు మిత్రులు చిన కోటయ్య అని పూర్తిగా పిలుస్తారు...
చదివింది : కెమిస్ట్రీ లో గ్రాడ్యుయషన్, మరి కంప్యూటర్ అప్లికేషన్స్ లోనేమో పోస్ట్ గ్రాడ్యుయషన్... (సంబంధం లేదు కదా ? తప్పదు, కిక్ ఉంది కదా... !!!)
ఇంకా చదవాల్సింది : మూడు వంతుల జీవితం.....
నాకు నచ్చినది : నన్ను- మనవాడు అనుకొనేవాళ్ళు....
నేను ఇష్టపడేది : నన్ను- నావాడు అనుకొనేవాళ్ళు....
నాకు నచ్చనిది : నా వెనుక- నా గురించి మాట్లాడుకోనేవాళ్ళు....
నేను ఇష్టపడనిది : నన్ను- మోసం చేద్దాం అనుకొనేవాళ్ళు....
చివరిగా నేను ప్రేమించేది : నా వాళ్ళని-నన్ను కావాలి అనుకోనేవాల్లని..........